ముంబైలో 3 మెట్రోలైన్లకు శంకుస్థాపన చేసిన మోడీ

ప్రధాని మోడీ బెంగళూరు నుంచి ముంబైకి చేరుకున్నారు. విమానాశ్రయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వాగతం పలికారు. ముంబైలో 3 మెట్రోలైన్లకు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ లైన్లు పూర్తయితే ఇప్పటికే ఉన్న ముంబై మెట్రోకు అదనంగా మరో 42 కిలోమీటర్ల లైన్లు కలిసిరానున్నాయి. గైముఖ్ నుంచి శివాజీ చౌక్ వరకు 9.2 కిలోమీటర్లు, కల్యాణ్ నుంచి తలోజా వరకు 20.7 కిలోమీటర్లు, వాడాల నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు 12.8 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

ముంబై మెట్రో భవన్ కు కూడా భూమిపూజ చేశారు ప్రధాని. ఈ కొత్త లైన్లకు 18 వేల కోట్ల నిధులు అవసరం. మెట్రో కోచ్ ను ప్రారంభించారు మోడీ. అంతకు ముందు విల్లేపార్లేలోని లోకమాన్య సేవా సంఘ్ తిలక్ మందిర్ లో మోడీ గణపతి పూజ చేశారు. బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Latest Updates