‘పాకిస్తాన్, చైనా ల‌తో యుద్ధానికి మోడీ టైం ఫిక్స్ చేశారు’

యూపీ బీజేపీ చీఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, చైనా దేశాలతో యుద్ధం ఎప్పుడు చేయాలనే విషయాన్ని ప్రధాని మోడీ నిర్ణయించారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నట్టే యుద్ధంపై కూడా మోదీ ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

బీజేపీ ఎమ్మేల్యే సంజయ్ యాదవ్ ఇంటి వద్ద జ‌రిగిన మీడియా సమావేశంలో స్వతంత్రదేవ్ సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. చైనా, పాక్‌తో యుద్దానికి మోడీ ఇప్పటికే రెడీగా ఉన్నారని, భారత్ ఎప్పుడు యుద్ధం చేయాలో కూడా మోడీ డిసైడ్‌ చేసేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest Updates