ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ

దేశ వ్యాప్తంగా 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలేని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. దేశ ప్రజలకు మోడీ స్వాతంత్య్ర దినోత్సవ, రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకలకు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు.

అంతకు ముందు ప్రధాని మోడీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌  దగ్గర మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

 

Latest Updates