గాంధీనగర్ లో ప్రధాని మోడీ : అమ్మతో ముచ్చట

ఓటేసే ముందు మోడీకి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం

కొడుకు మోడీకి శాలువా కానుక ఇచ్చిన తల్లి

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ఉదయం తన సొంత ఇంటికి వచ్చారు. గుజరాత్ రాష్ట్రానికి నిన్న సాయంత్రం చేరుకున్న మోడీ.. రాత్రి రాజ్ భన్ లో బస చేశారు. ఈ ఉదయం గాంధీనగర్ లో ఉంటున్న తన తల్లి హీరాబెన్ మోడీ ఇంటికి చేరుకున్నారు. అమ్మను ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఇద్దరూ ఒకరినొకరు టిఫిన్ తినిపించుకున్నారు. మోడీకి బొట్టుపెట్టి ఆశీర్వచనాలు అందించారు హీరాబెన్. మోడీకి శాలువాను కానుకగా ఇచ్చారు.

మూడో దశ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్ లోనూ పోలింగ్ జరుగుతోంది. గాంధీ నగర్ నియోజకవర్గంలో ప్రధాని మోడీ ఇవాళ తన ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. అహ్మదాబాద్ పరిధిలోని రానిప్ ప్రాంతం.. నిషాన్ స్కూల్ లో మోడీ ఓటేయబోతున్నారు.

BJP అగ్ర నాయకుడు ఎల్కే అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా గుజరాత్ కు వచ్చారు. ఇవాళ వారు తమ ఓటు వేయబోతున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ల ఓట్లు కూడా గుజరాత్ లోనే ఉన్నాయి.

 

Latest Updates