భారత్-రష్యాలది దృఢమైన బంధం: మోడీ

భారత్-రష్యాలది దృఢమైన బంధమని అన్నారు ప్రధాని మోడీ.. రష్యా పర్యటనలో ఉన్న ఆయన.. ఇరు దేశాల మధ్య  స్నేహబంధం   తన పర్యటనతో మరింత బలోపేతం కానుందని అన్నారు మోడీ.  రష్యా అత్యున్నత పౌర పురస్కారం తనకు ప్రకటించడంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు. పుతిన్ కు థ్యాంక్స్ చెప్పిన ఆయన… ఈ గౌరవం 130 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమైని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత ఎత్తులకు తీసుకెళ్లాలన్నారు మోడీ.

అంతకుముందు వ్లాదివోస్టోక్ లో పుతిన్ తో కలిసి  జ్వెజ్డా షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ కు వెళ్లారు ప్రధాని మోడీ. స్పెషల్ క్రూయిజ్ లో షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు. లోపల నౌకల తయారీని పరిశీలించారు. నౌకల నమూనాలను చూశారు. ప్రతీ స్పెసిమన్ గురించి మోడీకి వివరించారు పుతిన్.

Latest Updates