ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం: ప్రధాని మోడీ

ఆర్టికల్‌ 370 ను రద్దు చేసి పటేల్‌ ఆకాంక్షను నెరవేర్చామన్నారు ప్రధాని మోడీ అన్నారు. ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ, రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యమని అన్నారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు.  ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారని తెలిపారు. వారు ఆశించిన ప్రకారమే సుపరిపాలన అందిస్తామని చెప్పారు.అధికారంలోకి వచ్చిన 10 వారాల్లోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచామన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు చేశామన్నారు. ఆర్టికల్‌ 370, 35ఏను రద్దు చేసి కశ్మీరులకు బహుమతి ఇచ్చామన్నారు. ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాలన్నారు. జమ్మూకశ్మీర్‌ లడఖ్లో శాంతి స్థాపనే లక్ష్యమన్నారు. నా భవిష్యత్తు గురించి తనకు దిగులు లేదని, దేశ భవిష్యత్తే తనకు ముఖ్యమన్న ప్రధాని మోడీ.. వచ్చే ఐదేళ్లు మెరుగైన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు.

Latest Updates