‘మహాకాల్ ఎక్స్ ప్రెస్’ ను ప్రారంభించిన మోడీ

ఒకరు గెలిచారా, ఓడారా అనేది ముఖ్యం కాదన్నారు ప్రధాని మోడీ. దేశమనేది ఆచారాలు, సంస్కృతి, శక్తి సామర్థ్యాల ద్వారా ఏర్పడుతుందే తప్పా…. అధికారం వల్ల కాదన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్న మోడీ. 30 అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. మహాకాల్ ఎక్స్ ప్రెస్ ను వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఆతరువాత 63 ఫీట్ల దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అంతకుముందు వారణాసి చేరుకున్న ప్రధానికి స్వాగతం పలికారు యూపీసీఎం యోగి ఆదిత్యానాథ్. వారణాసికి చేరుకోగానే ముందుగా జంగంవాడీ మాతాజీని దర్శించుకున్నారు ప్రధాని. టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులతో కలిసి ఫోటోలు దిగారు.

Latest Updates