కరోనాపై సార్క్ దేశాల అధినేతలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సార్క్ దేశాల అధినేతలు, ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది. వైరస్ కంట్రోల్ కు సార్క్ దేశాలన్ని కలిసి కొవిడ్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాలని నిర్ణయించారు. దీనికోసం భారత్ 10 మిలియన్ డాలర్లు ప్రకటిస్తున్నట్టు చెప్పారు మోడీ. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స,  అఫ్గనిస్తాన్ ప్రెసిడెంట్ ఆఫ్రఫ్ ఘని, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలి, భూటాన్ ప్రధాని లోటే షెరింగ్, నేపాల్ పీఎం కేపీ శర్మ ఓలి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి జఫర్ మీర్జా పాల్గొన్నారు.

Latest Updates