అమ్మ ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తన 69వ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ లో పర్యటించారు. ఇందులో భాగంగా గాంధీనగర్ లో నివసిస్తున్న తన తల్లి హారాబెన్ దగ్గరకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.

తర్వాత ఐక్యతా విగ్రహం, సఫారీ పార్క్‌, సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌లను సందర్శించారు మోడీ. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌పై నమామీ నర్మద కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్మదా నదికి మోడీ హారతి నిర్వహించారు.

అంతకు ముందు నర్మదా జిల్లా కేవడియాలోని బట్టర్ ఫ్లై గార్డెన్ సందర్శించి..సీతాకోకచిలుకలను గాల్లోకి ఎగరేశారు. ఆ తర్వత కాక్టస్ గార్డెన్‌కు వెళ్లారు. ఖాల్వని ఎక్ టూరిజం స్థలాన్ని సందర్శించారు ప్రధాని మోడీ.

Latest Updates