జైట్లీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మోడీ

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ పరామర్శించారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్ ను మోడీ ఓదార్చారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ గత శనివారం అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆ సమయంలో UAEలో పర్యటిస్తున్నారు మోడీ. జైట్లీ మరణవార్త తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. విదేశీ పర్యటన నుంచి రాత్రి ఢిల్లీ చేరుకున్న ప్రధాని..  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి జైట్లీ ఇంటికి వెళ్లారు.

Latest Updates