మోస్ట్ పాపులర్ పొలిటీషియన్‌‌గా మోడీ

న్యూఢిల్లీ: ట్విట్టర్‌‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతగా ప్రధాని మోడీ ఘనతను సాధించారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌‌గా ఉన్న నేతల్లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన నేతగా మోడీ రికార్డు సృష్టించారు. ట్విట్టర్ ఫాలోవర్ల విషయంలో మోస్ట్ యాక్టివ్ పాపులర్ పొలిటీషియన్‌గా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ అకౌంట్‌‌ను ట్విట్టర్ పర్మినెంట్‌గా తొలగించింది.

దీంతో మోడీ సెకండ్ ప్లేస్‌‌కు చేరారు. ప్రస్తుతం మోడీకి ట్విట్టర్‌‌లో 64.7 మిలియన్‌‌ల ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్‌‌ అకౌంట్ సస్పెండ్ కాకముందు ఆయనకు 88.7 ఫాలోవర్స్ ఉండేవారు. ఓవరాల్‌‌గా పాపులర్ నేతల్లో అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తొలి స్థానంలో ఉన్నారు. ఆయనకు 127.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Latest Updates