కరోనా కట్టడిలో వరల్డ్​ నెంబర్​ 1 మోడీ

న్యూఢిల్లీ: కరోనాపై ఫైట్​ చేయడంలో ప్రపంచంలోనే మన ప్రధాని మోడీ నెంబర్​ వన్​ అంటూ పోల్​స్టర్​ మార్నింగ్​ కన్సల్ట్​ పేర్కొంది. ఏప్రిల్​ 14న ప్రపంచ దేశాల నేతలకు వచ్చిన రేటింగ్స్​ను ఈ సంస్థ విడుదల చేసింది. ఇందులో మోడీకి అత్యధిక రేటింగ్​ దక్కిందని తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో, అత్యధిక జనాభాను మోడీ చాలా చక్కగా డీల్​ చేశారని పేర్కొంది. తబ్లిగి వంటి సంఘటన జరిగినా.. ఆ మీటింగ్​ కు హాజరైన వారు ఆచూకీ కోసం ప్రయత్నించాల్సి వచ్చినా ప్రభుత్వ చర్యలు బాగున్నాయని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనాను సమర్థంగా అడ్డుకున్నారంది. సంస్థ పోల్​ లో మోడీకి లభించిన రేటింగ్​ 68  కాగా.. ఆయన తర్వాత ఒబ్రెడార్ (మెక్సికో)కు 36 పాయింట్ల రేటింగ్​ దక్కింది. తర్వాతి స్థానాల్లో జాన్సన్(యూకే) 35, స్కాట్​ మారిసన్ (ఆస్ట్రేలియా) 26, ట్రూడో (కెనడా) 21, మెర్కెల్ (జర్మనీ) 16 రేటింగ్​ దక్కగా అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​కు దక్కిన రేటింగ్​ -3 అని సంస్థ తెలిపింది.

Latest Updates