ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే మా తొలి లక్ష్యం

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తమ తొలి లక్ష్యమని ప్రదాని మోడీ అన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) 125వ వార్షికోత్సవంలో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలో అన్‌లాక్ మొదటి దశ ప్రారంభమైంది. మరో వారంలో రెండో దశ కూడా ప్రారంభమవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేలా కృషిచేయాలి. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. లాక్డౌన్‌తో పారిశ్రామిక రంగానికి ఇబ్బందులు తలెత్తాయి. ఈ సవాళ్లు తాత్కాలికమే.. మళ్లీ ఆర్థికరంగం పుంజుకుంటుంది. కరోనా సమయంలో ఆత్మనిర్భర్ ప్యాకేజీ పేదలకు అండగా నిలిచింది. దీర్ఘకాల దృష్టితోనే ఆత్మనిర్భర్ ప్యాకేజీని తీసుకొచ్చాం. ఆన్‌లైన్ క్లాసులతో విద్యారంగంలో కొత్త ఒరవడి తీసుకొచ్చాం. జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల ఫలితాలు రాబోతున్నాయి. ప్రైవేట్ రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తాం. గ్యాస్ సిలిండర్ల ద్వారా పేదలకు రూ. 800 కోట్లు సాయం చేశాం. ఇప్పటివరకు పేదల కోసం రూ.53వేల కోట్లు ఖర్చు చేశాం. ఇంటిగ్రేటెడ్, ఇంటర్ కనెక్టడ్ ప్రణాళికలతో ముందుకెళ్తున్నాం. దశాబ్దాలుగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని దూరం చేశాం. ఈ-ట్రేడింగ్ ద్వారా రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశాం. ఉపాధి పెంచేందుకు సంస్కరణలు తీసుకొచ్చాం. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ మా నినాదం.. కోల్ రంగంలో కమర్షియల్ మైనింగ్ తీసుకొచ్చాం. తద్వారా మైనింగ్, ఎనర్జీ రంగాలు పురోగమిస్తున్నాయి. చిన్నచిన్న పరిశ్రమలకు కేంద్రం అండగా ఉంటుంది. చిన్న పరిశ్రమలకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. భారత్ తీసుకున్న చర్యలకు ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి.

For More News..

స్కూళ్లు తెరవొద్దని 2 లక్షల మంది పేరెంట్స్ పిటిషన్

ప్రపంచానికిప్పుడు కేర్, క్యూర్ కావాలి

సచిన్‌ ఆట కోసం క్లాస్‌లు ఎగ్గొట్టాం

చెత్తబుట్టలో బీసీ లోన్‌‌ దరఖాస్తులు

Latest Updates