ఇండియన్స్ సొంత ఉత్పత్తులనే వాడాలి

భారత పురోగతిలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పాత్ర గొప్పదని ప్రధాని మోడీ అన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనావైరస్ పై యుద్ధం చేస్తోందని ఆయన అన్నారు. ఐసీసీ గురించి మోడీ మాట్లాడుతూ.. ‘కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. గత నెలలోనే రెండు సైక్లోన్లు వచ్చాయి. ఉత్తరాదిలో మిడతల దండు ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రజల మద్ధతుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. దేశానికి ఇది పరీక్షా సమయం. మనం ఓటమిని ఒప్పుకోవద్దు. నిత్యం గెలుపు కోసం ప్రయత్నించాలి. కరోనా వారియర్స్ ను మనం గౌరవించుకోవాలి. ఛాలెంజ్ లను ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ఆత్మనిర్భర్ భారత్ స్పూర్తితో ముందుకు సాగుదాం. భవిష్యత్తును నిర్ణయించేది మన శక్తి సామర్థ్యాలే. ఇలాంటి కఠిన సమయాల్లోనే ధైర్యంగా నిలబడాలి. సవాళ్లను ఎదుర్కొవడంలో పరస్పర సహకారం అవసరం. ఇండియన్స్ తమ సొంత ఉత్పత్తులనే వాడాలి. స్వామి వివేకానంద ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. దేశం తన కాళ్లపై తాను నిలబడాలి. స్వదేశీ నినాదం ఊపందుకోవాలి. ఎన్నో దేశాలకు మన వస్తువులను ఎగుమతి చేస్తున్నాం. చిన్న పరిశ్రమలకు సాయంగా వేల కోట్లు కేటాయించాం. పరిశ్రమల రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగిపోతున్నాయి.రైతులు దేశంలో తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తున్నాం’ అని మోడీ అన్నారు.

For More News..

రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు లేవ్​

కేటీఆర్ మోసం చేశాడని ఫిర్యాదు.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు

దగ్గుతున్నాడని బస్సులోంచి దింపేసిన్రు.. కాసేపటికే రోడ్డుపై మృతి

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ

Latest Updates