శ్రీలంక: ఉగ్ర దాడుల్లో చనిపోయిన వారికి పీఎం మోడీ నివాళి

శ్రీలంకలో ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు ప్రధాని మోడీ. మాల్దీవుల పర్యటన ముగించుకున్న తర్వాత కొలంబో చేరుకున్న మోడీకి శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే ఎయిర్ పోర్టు లో స్వాగతం పలికారు. ఇటీవల సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగిన మానవ బాంబు పేలుళ్లలో చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రధానికి సెర్మోనియల్ వెల్మకమ్ చెప్పారు శ్రీలంక ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన. ప్రెసిడెంట్ సెక్రటేరియట్ లో ప్రధాని మోడీ మొక్క నాటారు. శ్రీలంకకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు మోడీ.

Latest Updates