గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న మోడీ

PM Modi performs Ganga Aarti at Dashashwamedh Ghat, offers prayers on the riverbank

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు వారణాసిలో భారీ రోడ్ షో నిర్వహించారు. శుక్రవారం  తన నామినేషన్ దాఖలు చేయనున్న క్రమంలో మోడీ.. జెడి (యు) చీఫ్ నితీష్ కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేలతో సహా పలు సీనియర్ బీజేపీ నేతలతో కలసి రోడ్ షో లో పాల్గొన్నారు.  ఈ ర్యాలీకి బీజేపీ కార్యకర్తలు, మోడీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.   రోడ్ షో తర్వాత  మోడీ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గర నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest Updates