జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధాని ఆరా.. బండి సంజయ్‌కు ఫోన్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి ప్రధాని ఆరా తీశారని బండి సంజయ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ఆయన ప్రశంసించారని సంజయ్ తెలిపారు. ‘టీఆర్ఎస్ పార్టీ డబ్బుల పంపకం, దౌర్జన్యాల గురించి మోడీ నన్ను వివరాలు అడిగారు. టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను బీజేపీ కార్యకర్తలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాగా పనిచేసిన బీజేపీ రాష్ట్ర శాఖకు మోడీ శుభాకాంక్షలు చెప్పారు.

ఎన్నికల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 10 నిమిషాల పాటు.. ఎన్నికల సరళిపై మరియు పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. బీజేపీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని అభినందించారు. నాయకుల, కార్యకర్తలపైన జరిగిన దౌర్జన్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను మోడీ కొనియాడారు. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా దైర్యంగా ముందుకు సాగాలని.. అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మోడీ సూచించారు’ అని ఎంపీ బండి సంజయ్ తెలిపారు.

For More News..

ప్రపంచంలో సింగపూర్‌లోనే తొలిసారిగా ల్యాబ్ చికెన్

పెళ్లి వాహనంపై బోల్తా పడ్డ ఇసుక లారీ.. ఎనిమిది మంది మృతి

ఆరుగురు ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్స్‌తో పెళ్లికొచ్చిన క్లబ్ ఓనర్

Latest Updates