నితీశ్ కుమార్ పాత్ర చాలా కీలకం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: బిహార్‌‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. దీంతో పార్టీలు సీట్లు, పొత్తులు, ఎన్నికల వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నాయి. అధికార బీజేపీ కూడా అదే పనుల్లో బిజీగా ఉంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూతోపాటు చిరాగ్ పవన్ నేతృత్వంలోని ఎల్‌‌జేపీతో ఎన్‌‌డీఏ పొత్తు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ గురించి ప్రధాని మోడీ పలు విషయాలు మాట్లాడారు. బిహార్‌‌ను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారంటూ నితీశ్‌‌పై మోడీ మెచ్చుకోళ్ల వర్షం కురిపించారు. పదిహేనేళ్లుగా ఆయన మంచి పనిని కొనసాగిస్తున్నారని చెప్పారు.

‘అభివృద్ధి దిశగా బిహార్‌ను ముందుకు తీసుకెళ్లడంలో నితీశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బిహార్‌‌లో మంచి పాలన ఉండాలన్నదే మా ధ్యేయం. గత పదిహేనేళ్లుగా జరుగుతున్న మంచి పనులు ఇలాగే కొనసాగాలి. సరైన ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు, పాలసీలు అందరికీ చేరాయి. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ చాలా మెరుగైంది. కొత్తగా ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, లా ఇన్‌‌స్టిట్యూట్‌‌లు, పాలిటెక్నిక్ కళాశాలలు పెరిగాయి. బిహార్‌‌లో అన్ని రంగాల అభివృద్ధి కోసం మేం పని చేస్తున్నాం’ అని మోడీ పేర్కొన్నారు.

Latest Updates