వ‌ర‌ద‌ల ప‌రిస్థితిపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్ర‌ధాని స‌మీక్ష‌

దేశంలోని వరదల పరిస్థితిపై ప్ర‌ధాని మోడీ సోమవారంనాడు సమీక్ష నిర్వ‌హించారు. ప‌లు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం, వరద పరిస్థితులను ఎదుర్కోవటానికి తీసుకుంటున్నచర్యలపై ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స‌మీక్ష జ‌రిపారు. అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక , కేరళ ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

వరదలను అంచనా వేయడానికి ,శాశ్వత వ్యవస్థను కలిగి ఉండటానికి కేంద్ర రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం గురించి ప్ర‌ధాని మాట్లాడారు. వాతావరణ సమాచార హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరచడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రాల్లో వరద పరిస్థితులు,సహాయక చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. సకాలంలో సహాయక బృందాలను మోహరించడంలో, ప్రజలను రక్షించడంలో ఎన్డీఆర్ఎఫ్ సహా కేంద్ర ఏజెన్సీల కృషిని ముఖ్యమంత్రులు అభినందించారు.

Latest Updates