ఫొని తుఫానుపై ప్రధాని మోడీ హైలెవెల్ రివ్యూ

ఢిల్లీ : ఫొని(Fani) తుఫానుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలో హైలెవెల్ రివ్యూ జరిపారు. తుఫాను నష్ట నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్యలపై సమీక్ష జరిపారు ప్రధాని. సమావేశానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఉన్నతాధికారులు అటెండయ్యారు.

ఫణి తుఫాను గమనం, ముందు జాగ్రత్త చర్యలను ఈ సమీక్షలో వివరించారు ఉన్నతాధికారులు. తుఫాను ప్రభావిత రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు ప్రధానమంత్రి. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన అన్ని సహాయ పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Latest Updates