గతేడాది కంటే పెరిగిన ప్రధాని మోడీ సంపాదన

న్యూఢిల్లీ: గతేడాదితో పోల్చుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ సంపాదన కొంత పెరిగింది. ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన ఆస్తుల ప్రకటనతో మోడీ సంపాదన గురించి తెలిసింది. ఈ ఏడాది జూన్ నాటికి మోడీ సంపాదన రూ.2.85 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే రూ.36 లక్షలు ఎక్కువని చెప్పొచ్చు. గతేడాది మోడీ సంపాదన రూ.2.49 కోట్లు. ఈ ఏడాది జూన్ చివరాఖరుకు మోడీ వద్ద నగదు రూపంలో రూ.31,450 ఉందని, ఆయన బ్యాంకు బ్యాలెన్స్ రూ.3,38,173గా తెలుస్తోంది.

ప్రధాని మోడీ ఎలాంటి లోన్లు తీసుకోకపోగా, ఆయన పేరు మీద వ్యక్తిగత వాహనం కూడా లేదు. మోడీ దగ్గర నాలుగు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. వాటి బరువు 45 గ్రాములు, విలువ సుమారు రూ. 1.5 లక్షలు. గాంధీనగర్‌‌లోని సెక్టార్-1లో తనకు 3,531 స్క్వేర్ ఫీట్‌‌ల సొంత ప్లాట్ ఉందని, ఈ ప్లాట్‌‌ మరో ముగ్గురు జాయింట్ ఓనర్స్‌‌ ఉన్నారని, ప్లాట్‌‌లో ప్రతి ఒక్కరికి 25 శాతం చొప్పున షేర్ వస్తుందని పీఎంవోకు సమర్పించిన డిక్లరేషన్‌‌‌లో మోడీ పేర్కొన్నారు.

Latest Updates