40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : మోడీ

కోల్‌ కతా : తృణమూల్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో కాంటాక్ట్ లో ఉన్నారని సంచనల కామెంట్స్ చేశారు ప్రధాని మోడీ. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీరంపోర్‌ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు మోడీ. ‘దీదీ, ఫలితాల రోజున అనగా మే 23న దేశవ్యాప్తంగా కమలమే వికసిస్తుంది. మీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడతారు. అప్పుడు ప్రభుత్వాన్ని నడపడం మీకు కష్టంగా మారుతుంది. ఈ రోజు కూడా మీ పార్టీకి చెందిన ఓ 40 ఎమ్మెల్యేలు నాతో కాంటాక్ట్‌లో ఉన్నార’ని  ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హెచ్చరించారు మోడీ.

అంతేకాక బెంగాల్‌ ప్రజలు దీదీ పాలనతో విసిగిపోయారని మోదీ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనుమతుల నుంచి అడ్మిషన్ల దాకా ప్రతి దానికి డబ్బు చెల్లించాలన్నారు. కాదని ఎదురుతిరిగితే వారిని ఉరి తీస్తారని ఆరోపించారు. ‘బెంగాల్‌లో అణచివేత పాలన కొనసాగుతుంది. ఇక్కడ దైవ భక్తులు ప్రమాదం నీడలో జీవిస్తుంటే.. చొరబాటుదారులు మాత్రం హాయిగా బతుకుతున్నారు. దీదీ పాలనలో గుండాలకు పూర్తి భద్రత ఉంది. కానీ కూతుళ్లకు, చెల్లెళ్లకు మాత్రం రక్షణ కరువయ్యింద’ని విమర్శించారు.

Latest Updates