వెన్నుపోటు పొడవడంలో బాబు సీనియరే : పీఎం మోడీ

గుంటూరు జిల్లా : గుంటూరు పట్టణంలో ఏర్పాటుచేసిన బీజేపీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై సెటైర్స్ వేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. దేశంలోనే తాను సీనియర్ నాయకుడిని అంటూ చంద్రబాబు చెబుతారని.. ఆయన సీనియారిటీని సందేహించాల్సిన అవసరమే తనకు లేదని అన్నారు.

చంద్రబాబు సీనియారిటీని ఉద్దేశించి మాట్లాడుతూ“ మీరు చాలా సీనియర్. మీ సీనియారిటీని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. ఎప్పుడూ తక్కువ చేయలేదు. ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. సైడ్ మార్చడంలో మీరు సీనియరే. కొత్త కొత్త కూటములు కట్టడంలో మీరు సీనియరే. మామను వెన్నుపోటు పొడవడంలో గొప్ప సీనియర్. ఒక ఎన్నికల తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియర్ మీరే. నేను మీతో పోటీ పడలేను. మీరు ఈరోజు ఎవరిని తిడతారో.. వారి ఒళ్లో కూర్చోవడంలో గొప్ప సీనియర్. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్. సీనియారిటీని కాదనం కానీ.. ప్రజా సంక్షేమంలో ఆయన తప్పుడు దారిలో వెళ్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఎన్టీఆర్ మార్గంలో నడిచి ఆయన ఆశయాలను సాధించే బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదన్న సంగతి జనాలు గుర్తించారు కానీ.. ఇంకా మీ సీనియర్ లీడర్  గుర్తించడం లేదు” అని మోడీ అన్నారు.

Latest Updates