అయోధ్య తీర్పు గెలుపు, ఓటములది కాదు: మోడీ

అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు  చెప్పే తీర్పు ఎవరి గెలుపు ఓటములకు సంబంధించినది కాదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ వెలువడే తీర్పు రాబోయే కాలంలో శాంతిని, ఏకత్వాన్ని, దేశ సమైక్యతను ప్రదర్శించేలా ఉండేలా చూసుకోవాలని..అది దేశప్రజల బాధ్యత అని అందరికీ విజ్ఞప్తి చేశారు ప్రధాని. దేశంలో న్యాయ వ్యవస్థ గౌరవాన్ని అందరూ పరిరక్షించాలని కోరారు. కోర్టు తీర్పు తర్వాత కూడా ప్రతిఒక్కరు సామరస్యం చూపించాలని అన్నారు.

అయోధ్య తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర ప్రదేశ్ సీఎస్, డీజీపీలను పిలిపించుకుని మాట్లాడారు. అయోధ్య తో పాటు పలు సమస్యాత్మక ప్రాంతాలలో ఈరోజు పొద్దున ఆరు గంటలనుంచే భారీగా బలగాలను మోహరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హోంశాఖలను అలెర్ట్ చేసింది కేంద్ర హోం శాఖ.

Latest Updates