అన్నింటికన్నా అగ్గువ మన టీకానే

  • ఫస్ట్ ఫేజ్ లో 3 కోట్ల మంది హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్
  • సెకండ్ ఫేజ్ లో 50 ఏండ్లు పైబడినవాళ్లకు.. దీర్ఘకాలిక రోగాలు ఉన్నోళ్లకు..
  • రాబోయే కొన్ని నెలల్లో 30 కోట్ల మందికి టీకా
  • కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ పై సీఎంలతో మీటింగ్​లో మోడీ

న్యూఢిల్లీ: ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లు కొవిషీల్డ్,కొవ్యాగ్జిన్ అగ్గువ ధరకు లభిస్తాయని ప్రధాని మోడీ అన్నారు. ఎఫెక్టివ్ గా పని చేసే వ్యాక్సిన్ ను దేశ ప్రజలకు అందించేందుకు ఎక్స్ పర్ట్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో 3 కోట్ల మందికి ఫ్రీగా కరోనా వ్యాక్సిన్​ అందిస్తామన్నారు. వీళ్లందరికీ వ్యాక్సిన్ అందించేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిన అవసరం లేదని, మొత్తం కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించనున్న క్రమంలో సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.  ‘కరోనా క్రైసిస్ లో అందరం ఒక్కటై నిలిచి పని చేయడం సంతృప్తిగా ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం. దాని ఫలితంగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా పెద్దఎత్తున స్ప్రెడ్ కాలేదు’ అని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడేందుకు రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు.

మరో నాలుగు వ్యాక్సిన్లు కూడా రెడీ అవుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 16 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మొదట గవర్నమెంట్, ప్రైవేట్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, డిఫెన్స్ ఫోర్సెస్, పోలీసులు, పారామిలటరీ ఫోర్సెస్ కు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. రెండో ఫేజ్ లో 50 ఏండ్లు పైబడినవాళ్లకు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న 50 ఏండ్ల లోపు వాళ్లకు వ్యాక్సిన్ అందజేస్తామని స్పష్టం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.

పొలిటీషియన్లు టీకా కోసం తొందరపడొద్దు

కరోనా వ్యాక్సిన్ కోసం పొలిటీషియన్లు తొందరపడొద్దని, వాళ్ల టర్న్ వచ్చేవరకు వెయిట్ చేయాలని ప్రధాని మోడీ సూచించారు. వ్యాక్సినేషన్ కు గవర్నమెంట్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసిందని, మొదట కోటి మంది హెల్త్ వర్కర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు  టీకా అందిస్తామని స్పష్టం చేశారు. ఫస్ట్ ఫేజ్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీకా ఇవ్వాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చేసిన విజ్ఞప్తిని మోడీ తిరస్కరించారు.

‘ప్రారంభ్’ లో పాల్గొనండి: యువతకు మోడీ పిలుపు

ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే స్టార్టప్ ఇండియా ఇంటర్నేషనల్ సమ్మిట్ ‘ప్రారంభ్’లో పాల్గొనాలని యువతకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కరోనా కారణంగా వర్చువల్ ఇంటరాక్షన్స్ పెరిగాయని, జనం ఇండ్లల్లోనే కూర్చుని ఇలాంటి ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పారు. ‘చాలా ఈవెంట్స్ వర్చువల్ గా జరుగుతున్నయి. డొమెస్టిక్, గ్లోబల్ ఫోరమ్స్ ఈవెంట్స్ లో పాల్గొనేందుకు యంగ్ స్టర్స్ కు ఇది గొప్ప అవకాశం’ అని సోమవారం ట్వీట్ చేశారు. వర్చువల్ మీటింగ్స్ ద్వారా సైంటిస్టులు, మెడికల్ ప్రొఫెషనల్స్, కొవిడ్ వారియర్స్, అకాడెమిక్స్, ఇండస్ట్రీ లీడర్స్, యంగ్ ఇన్నోవేటర్లు, స్పిరిచ్యువల్ లీడర్లు ఇలా చాలా మందితో ఇంటరాక్ట్ అవడం సాధ్యమైందన్నారు. వరల్డ్ లీడర్స్ తో బైలాట్రల్, మల్టిలాట్రల్ వర్చువల్ సమ్మిట్స్ కూడా జరిగాయని గుర్తు చేశారు. వర్చువల్ గా డెవలప్ మెంట్ స్కీమ్స్ ను ప్రారంభించే అవకాశం దొరికిందని, గవర్న మెంట్ స్కీమ్స్ పై లక్షల మంది లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అయ్యానని తెలిపారు. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ మొదలై ఐదేళ్లు పూర్తవుతోందని గుర్తు చేశారు. స్టార్టప్ లకు ఇండియా కేంద్రంగా మారిందని, పెద్ద సిటీలే కాదు చిన్న పట్టణాల నుంచి స్టార్టప్ హీరోలు తెరపైకి వస్తున్నారని అన్నారు.

‘కరోనా క్రైసిస్ లో అందరం ఒక్కటై నిలిచి పని చేయడం సంతృప్తిగా ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం. దాని ఫలితంగా మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా పెద్దఎత్తున స్ప్రెడ్ కాలేదు’ అని అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడేందుకు రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. మరో నాలుగు వ్యాక్సిన్లు కూడా రెడీ అవుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 16 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా మొదట గవర్నమెంట్, ప్రైవేట్ హెల్త్ వర్కర్లు, శానిటేషన్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, డిఫెన్స్ ఫోర్సెస్, పోలీసులు, పారామిలటరీ ఫోర్సెస్ కు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. రెండో ఫేజ్ లో 50 ఏండ్లు పైబడినవాళ్లకు, దీర్ఘకాలిక రోగాలు ఉన్న 50 ఏండ్ల లోపు వాళ్లకు వ్యాక్సిన్ అందజేస్తామని స్పష్టం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.

 

Latest Updates