పాకిస్థాన్ తో ఇక చర్చల్లేవ్.. దెబ్బ కొట్టుడే : మోడీ

భారత్, అర్జెంటీనా మధ్య రెండు దేశాలకు సంబంధించిన పలు ఒప్పందాలు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసినో మాక్రి సమక్షంలో… రెండు దేశాల అధికారులు అంగీకార పత్రాలు(MoU)లను మార్చుకున్నారు. ఢిల్లీలో ఇద్దరు ఉమ్మడి ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ “ప్రపంచ దేశాల సుస్థిరత, శాంతికి ఉగ్రవాదం పెద్ద ముప్పులాంటిది. పాకిస్థాన్ తో సరిహద్దు సమస్య చర్చలతో పరిష్కారం అవుతుందన్న నమ్మకం .. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పోయింది. ఇక చర్చలకు టైమే లేదు. ప్రపంచం అంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటై… స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ఇష్టపడకపోవడం కూడా టెర్రరిజానికి మద్దతు పలికినట్టుగా భావించాల్సి ఉంటుంది. జీ20 దేశాల్లో భాగస్వామిగా… హ్యాంబర్గ్ లీడర్స్ సమ్మిట్ లో చేసిన 11 పాయింట్ల ఫార్ములాను అమలు చేయడం చాలా ముఖ్యం. ఇండియా, అర్జెంటీనా సంయుక్తంగా.. ఉగ్రవాదంపై ఓ ప్రకటన చేస్తాం” అని మోడీ అన్నారు.

 

Latest Updates