ఉగ్రవాదం ఆయుధం IED..ప్రజాస్వామ్యం బలం ఓటర్ ID:మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటేశారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పరిధిలో ఉన్న రానిప్ ప్రాంతంంలోని నిషాన్ హయ్యర్ సెకెండరీ స్కూల్లో ఆయన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. మోడీ రాకతో.. ఈ పోలింగ్ బూత్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అక్కడ ఓ చిన్నారిని ఎత్తుకుని ముద్దు చేశారు మోడీ.

ఓటు వేసిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడారు పీఎం నరేంద్రమోడీ. ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు. కుంభమేళాలో మునక వేస్తే ఎంత పరిపూర్ణంగా భావిస్తారో.. ప్రజాస్వామ్యంలో ఓటేస్తే అంత పరిపూర్ణత వస్తుందన్నారు మోడీ. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండుగలాంటివన్నారు. ఉగ్రవాదానికి IED(ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్) ఆయుధం లాంటిదని చెప్పిన మోడీ…  ప్రజాస్వామ్యానికి బలాన్నిచ్చేది ఓటర్ ID అన్నారు. IED కంటే Voter ID చాలా శక్తిమంతమైనదని అన్నారు. ఓటులోని శక్తిని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు మోడీ.

 

Latest Updates