ప్రపంచానికిప్పుడు కేర్, క్యూర్ కావాలి

న్యూఢిల్లీ: ‘‘రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం ఇప్పుడు అతిపెద్ద క్రైసిస్ ఎదుర్కొంటోంది. ప్రపంచ యుద్ధాలకు ముందు.. తర్వాత అన్నట్లుగా ప్రపంచం మారింది.. ఇప్పుడు కరోనాకు ముందు తర్వాత అన్నట్లుగా మారుతుంది” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచం ఇప్పుడు డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, సైంటిఫిక్ కమ్యూనిటీ వైపు ఎంతో ఆశతో, కృతజ్ఞతా భావంతో చూస్తోందని చెప్పారు. హెల్త్ కేర్ సిబ్బంది నుంచి కేర్, క్యూర్ కోరుకుంటోందని కామెంట్ చేశారు. ప్రపంచం కచ్చితంగా ఏకం కావాలని.. అభివృద్ధి విషయంలో ‘హ్యూమన్ సెంట్రిక్’ అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కర్నాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలను సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించారు. తర్వాత మాట్లాడారు. వైరస్ ను రూట్ లెవల్ నుంచి ఎదుర్కోవడంలో మెడికల్ కమ్యూనిటీతోపాటు కరోనా వారియర్స్ హార్డ్ వర్క్ దాగి ఉందన్నారు. డాక్టర్లు, మెడికల్ వర్కర్స్ కూడా సైనికులేనని,  కాకపోతే వారు ఆర్మీ యూనిఫామ్ లేని సోల్జర్స్ అని పొగిడారు.

దాడులు సరికాదు..

హెల్త్ కేర్ సిబ్బందిపై హింసకు పాల్పడటం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటివి ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇలాంటి సంఘటనలు ‘మూక మనస్తత్వానికి’ ఫలితాలని అన్నారు. ‘‘మీ భయాల గురించి నాకు తెలుసు. కొందరి ‘మూక మనస్తత్వం’ వల్ల.. డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ వర్కర్లు, ఇతర ఫ్రంట్​లైన్ వర్కర్లు హింసకు గురవుతున్నారు” అని చెప్పారు. హెల్త్ కేర్ సిబ్బందిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించినట్లు మోడీ తెలిపారు.

మూడు ముఖ్యం..

ఆరోగ్యకరమైన సమాజం కోసం టెలిమెడిసిన్ పురోగతి, ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల వాడకం, వైద్య రంగంలో ఐటీ టూల్స్ ఉపయోగంపై మోడీ ప్రస్తావించారు. అవి చాలా ముఖ్యమన్నారు.

టెలిమెడిసిన్: టెలిమెడిసిన్ పెద్ద ఎత్తున పాపులర్ అయ్యేలా కొత్త మోడళ్లపై పని చేయాలి.

మేక్ ఇన్ ఇండియా: స్థానిక తయారీదారులు ఇప్పటికే పీపీఈ కిట్లు తయారు చేస్తున్నారు. కొవిడ్ వారియర్ల కోసం కోటి కిట్లు రెడీ చేసి ఇచ్చారు. 1.2 కోట్ల ‘మేక్ ఇన్ ఇండియా’ ఎన్95 మాస్కులు తయారు చేశారు.

ఐటీ బేస్డ్ టూల్స్: ఆరోగ్యకరమైన సమాజాల కోసం ఐటీ టూల్స్ ఉపయోగించాలి. ఇందుకు ఆరోగ్య సేతు ఓ ఉదాహరణ. ఇప్పటికే 12 కోట్ల మంది ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకున్నారు.

డాక్టర్లు, మెడికల్ వర్కర్స్ కూడా సైనికులే. కాకపోతే వారు ఆర్మీ యూనిఫామ్ లేని సోల్జర్స్. కరోనా వైరస్ మన కంటికి కనిపించని శత్రువు కావచ్చు. కానీ మన మెడికల్ వర్కర్స్.. ఓటమి ఎరుగని యోధులు. అదృశ్య-అజేయ శక్తుల మధ్య జరుగుతున్న పోరు ఇది. మన వైద్య సిబ్బంది కచ్చితంగా గెలుస్తారు.

– ప్రధాని నరేంద్ర మోడీ

మూడోసారి మోడీనే

దేశంలో 70 శాతం మంది నరేంద్ర మోడీని ప్రధానిగా కోరుకుంటున్నారని కర్నాటక సీఎం బీఎస్​ యడియూరప్ప అన్నారు. ప్రస్తుత టర్మ్ పూర్తయిన తర్వాత మరోసారి కూడా ఆయనే పీఎం కావాలని ఎక్కువమంది భావిస్తున్నారని తెలిపారు. జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ తొలగిస్తూ ఆర్టికల్ 370 రద్దు చేసిన మోడీని ఐరన్ లీడర్‌‌గా అభివర్ణించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్​​ప్రిన్సిపల్స్, స్కీమ్స్ తో దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు.

For More News..

సచిన్‌ ఆట కోసం క్లాస్‌లు ఎగ్గొట్టాం

చెత్తబుట్టలో బీసీ లోన్‌‌ దరఖాస్తులు

జనం కోసమే తెలంగాణ

ఉద్యమ లక్ష్యాలకు దూరంగా..

Latest Updates