ప్రతీ క్షణం దేశ అభివృద్ధి కోసమే పాటుపడతా: ప్రధాని మోడీ

pm-modi-speech-after-lok-sabha-2019-results

ప్రధాని మోడీ ఢిల్లీ లోని బీజేపీ హెడ్ ఆఫీసులో మాట్లాడారు.  పార్టీ ఆఫీసు బయట ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడుతూ.. 2019 లోక్ సభ ఎన్నికలలో NDA ను గెలిపించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సభలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

దేశంలోని ప్రజలు ఈ ఫకీర్ జోలెను నింపారని మోడీ అన్నారు. ఇందుకు దేశంలోని 130 కోట్ల మంది భారతీయులకు తలవంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సారి అధిక సంఖ్యలో ప్రజలు ఓటేశారని అన్నారు. తనను నమ్మి మరోసారి NDA ను గెలిపించినందుకు ప్రతీ క్షణం దేశ అభివృద్ధికోసమే పాటుపబతానని మోడీ తెలిపారు.

NDAను సపోర్ట్ చేసిన పార్టీలకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. ఈ లోక్ సభ ఎన్నికలలో గెలిచిన ప్రతీ MPకి ఆయన అభినందనలు తెలిపారు. ప్రతీ ఒక్క MP దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని కోరారు. బీజేపీ ఎన్నిసార్లు గెలిచినా మా ఆదర్శాలను, వినమ్రతను విడువమని అన్నారు మోడీ.

గత ఐదు సంవత్సరాల కాలంలో హింసకు తావులేకుండా పరిపాలించామని మోడీ తెలిపారు. బారత్ లో రెండే జాతులున్నాయన్న మోడీ… అందులో ఒక జాతి గరీబ్ జాతీ అని,… రెండవది గరీబ్ జాతిని తరిమే జాతి ఉందని ఆయన అన్నారు. భారత్ ను మరింత అభివృద్ధి చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుందని తెలిపారు. స్వతంత్ర భారతం నుంచి దేశం అభివృద్ధి భారత్ దిశగా మరింత ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు.

విపక్షాలు బీజేపీని ఎంత విమర్షించినా.. మేము అందరినీ కలుపుకుని దేశ అభివృద్ధి వైపు పయనిస్తామని మోడీ అన్నారు. ప్రతీ ఒక్క దేశ్ వాసీ ఇందులో భాగమని చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికలలో గెలిపించిన వారి సంఖ్య కంటే ఈ సారి మరింత ఎక్కువ మంది MP లను గెలిపించినందుకు దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో తమకు మరింత బాధ్యత పెరిగిందని మోడీ అన్నారు.

Latest Updates