6గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం..సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి

ప్రధాని మోడీ సాయంత్రం 6గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నాను. దయచేసి మీరంతా ఇందుకు సిద్ధంగా ఉండగలరని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. అయితే మోడీ ఏ అంశంపై మాట్లాడతారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కరోనా , దసరా పండగలనుద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 24నుంచి విధించిన జనతా కర్ఫ్యూ నుంచి  అన్‌లాక్‌ ప్రక్రియ వరకు మొత్తం ఆరుసార్లు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.

Latest Updates