త్రివిధ దళాలకు ప్రధాని మోడీ కీలక సూచనలు

సీడీఎస్ బిపిన్ రావత్
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు చేస్తున్నారని చీఫ్ ఆఫ్​డిఫెన్స్ స్టాఫ్​(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే.. కరోనా లక్షణాలు కలిగిన వారిని గుర్తించడం తమకు సులువవుతుందన్నారు. కరోనా ఇండియాకు స్వావలంబన మార్గాన్ని నేర్పించిందని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా ఆవశ్యకతను, ప్రాంతీయ పరాక్రమాన్ని ఎలా బలోపేతం చేయడం లాంటి విషయాలను ఎత్తిచూపిందన్నారు. ‘ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలి. అప్పుడే కరోనాపై విజయం సాధించగలం. ఇండియా ఇతరులకు సాయం చేసేలా ఉండాలి గానీ సాయం కోసం ఇతరులను అర్థించే స్థితిలో ఉండొద్దు. కేబినెట్ సెక్రటరీలు మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలకు మినిస్ట్రీ ఆఫ్​హెల్త్ టైమ్ టూ టైమ్ సూచనలు చేస్తోంది. త్రివిధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ తో రక్షణ శాఖ మంత్రి కూడా మాట్లాడారు. ఆర్మీ సన్నాహాల గురించి అడిగి తెలుసుకున్నారు.​ మన జవాన్లు ఆర్మీ బార్డర్స్ లోనే ఉన్నారు. వాళ్లలో ఒక్కరికీ కరోనా సోకలేదు. నేవల్ షిప్స్, సబ్ మెరైన్స్ తోపాటు ఎయిర్ ఫోర్స్ లో కూడా ఎవరికీ కరోనా సోకలేదు’ అని రావత్ చెప్పారు.

Latest Updates