రేపు హైదరాబాద్​కు రానున్న మోడీ

భారత్ బయోటెక్ ప్లాంట్​ను సందర్శించనున్న ప్రధాని

కొవ్యాగ్జిన్ తయారీపై రివ్యూ

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ రానున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ప్లాంటును ఆయన సందర్శించనున్నారు. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ తదితరాలపై రివ్యూ చేయనున్నారు. హైదరాబాద్ రావడానికి ముందుగా మోడీ అహ్మదాబాద్ లోని జైడస్ క్యాడిలా కంపెనీ ప్లాంటును, తర్వాత పుణేలోని సీరమ్ ఇన్​స్టిట్యూట్ ను విజిట్ చేయనున్నారు. జైడస్ కంపెనీ జైకొవిడ్ పేరుతో, సీరమ్ ఇన్​స్టిట్యూట్ ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీతో కలిసి కొవిషీల్డ్ పేరుతో, భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్ తో కలిసి కొవ్యాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్ లను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ లు ప్రస్తుతం ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఒకేరోజు 3 వ్యాక్సిన్ లపై ప్రధాని స్వయంగా పరిశీలించనున్నారు.

Read More News….

ఆ రైలు పరుగుల వెనుక ‘‘పింక్ గ్యాంగ్’’

ఆక్సిజన్ ట్రీట్ మెంట్ తో వయసు​ తగ్గించొచ్చట

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

Latest Updates