మాన్ వర్సెస్ వైల్డ్ షో లో మోడీ

pm-modi-to-feature-in-man-vs-wild-episode-with-bear-grylls

భారత ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా  డిస్కవరి ఛానెల్ లో ప్రసారం కాబోయే ఓ  టెలివిజన్ షో లో పాల్గొననున్నారు. ఆ ఛానెల్ లో ప్రసారమయ్యే మాన్ వర్సెస్ వైల్డ్ షో లో షో హోస్ట్ బేర్ గ్రిల్స్ తో పాటు ఓ ఎపిసోడ్ లో కనిపించనున్నారు. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో షూటింగ్ జరిగిన  ఈ స్పెషల్ ఎపిసోడ్ ఆగష్టు 12న రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాల్లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఈ ఛానెల్ లో ప్రసారమయ్యే  స్పెషల్ ఎపిసోడ్ కోసం తనను సంప్రదించినపుడు ఎంతో క్యూరిసిటితో ఒప్పుకున్నానని ప్రధాని మోడీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రకృతి మధ్యలో గడిపేందుకు ఓ అవకాశం దొరికిందని ఆయన అన్నారు. చాలా సంవత్సరాలుగా తన జీవితం ప్రకృతిలోని అడవులు, కొండలతో ముడిపడి ఉందని,  ప్రకృతి  ప్రభావం తనపై ఎంతగానో ఉందని  మోడీ  ఈ సందర్భంగా అన్నారు.

Latest Updates