ప్రధాని మోడీ నామినేషన్ కు డేట్ ఫిక్స్

ప్రధాని మోడీ నామినేషన్ వేయడానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 26వ తారీకున నామినేషన్ దాఖలు చేయనున్నారు. వారణాసి నుంచి వరుసగా రెండవ సారి పోటీచేయనున్నారు మోడీ. పార్లమెంట్ ఎన్నికలలో 2014న మొదటిసారి పోటీ చేసిన మోడీ.. గజరాత్ వడోదర స్థానంతో పాటు, వారణాసి నుండి పోటీ చేశారు. అయితే రెండు స్థానాల్లో బరిలో నిలపడి గెలిచారు. ఆతర్వాత వడోదర స్థానానికి రాజీనామా చేసి వారణాసిలో కంటిన్యూ అయ్యారు.

2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వారణాసిలో రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నారు మోడీ. మొదటగా 25వ తేదీ.. బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి దశ్ అశ్వమేథ్ వరకు రోడ్ షో ఉండనుంది, 26వ తేదీన విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తరువాత మరో రోడ్ షో ఉండనుంది. ఆతరువాత మోడీ నామినేషన్ వేయనున్నారు.

Latest Updates