ప్రధాని మోడీకి మరో అవార్డ్…

ప్రధాని మోడీ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోనున్నారు. స్వచ్ఛభారత్ అభియాన్ తో  విన్నూత మార్పుకు శ్రీకారం చుట్టిన మోడీకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థ అవార్డ్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ సోమవారం ట్విట్టర్లో  ప్రకటించారు. ప్రధాని ప్రవేశపెడుతున్న కార్యక్రమాలకు ప్రపంచ వ్యాప్తంగా అవార్డులు రావడం ప్రతీ భారతీయుడికి గర్వకారణమని అన్నారు.త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మోడీ అవార్డును అందుకుంటారని తెలిపారు. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మోడీ స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Latest Updates