పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ మధ్యప్రదేశ్‌లో ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌) కింద నిర్మించిన 1.75లక్షల గృహాల ప్రవేశ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. 2లక్షల కుటుంబాలకు అభినందనలు, ఈ సారి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అన్నారు. గతంలో ప్రభుత్వం వెంట పేదలు పరుగెత్తే వారని.. ప్రస్తుతం ప్రభుత్వం పేదల దగ్గరకు వెళ్తోందన్నారు.

ఎవరి ఇష్టానికి అనుగుణంగా లిస్టులో పేరు జోడించడం, తీసివేయడం చేయలేమని, ఎంపిక నుంచి నిర్మాణం వరకు శాస్త్రీయ, పారదర్శక విధానాన్ని అవలంభిస్తున్నామని తెలిపారు ప్రధాని మోడీ.

Latest Updates