రేపు సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్

ఢిల్లీ: ఈనెల 16 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుండటంతో… దానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని సీఎంలతో మాట్లాడనున్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు.

ఇక మొదటి దశలో భాగంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మొదటి ప్రాధాన్యత 3 కోట్ల మంది కరోనా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇస్తారు. ఇందులో మున్సిపాలిటీ కార్మికులు కూడా ఉంటారు. మిగిలిన 27 కోట్ల మందిలో 50 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న 50ఏళ్ల లోపున్న వాళ్లకు వ్యాక్సిన్ ఇస్తారు.

Latest Updates