గాంధీ విగ్రహావిష్కరణ.. బోధి మొక్క బహూకరణ: కొరియాలో మోడీ

దక్షిణకొరియా పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు ప్రధాని మోడీ. సియోల్ లోని యోన్సీ యూనివర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, యూఎన్ మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గిమ్హే నగరంలో పర్యటించిన ప్రధాని… మేయర్ హియో సియోంగ్ గాన్ తో భేటీ అయ్యారు. బోధి చెట్టు మొక్కను ఆయన బహుమతిగా ఇచ్చారు.

సియోల్ లో జరిగిన ఇండియా- కొరియా బిజినెస్ సింపోసియంలో మోడీ పాల్గొన్నారు. భారత్ కు కొరియా అత్యంత ప్రాధాన్యత గల దేశమన్నారు ప్రధాని. ఇండియాలో 600కు పైగా కొరియా కంపెనీలు ఉన్నాయన్నారు. కొరియా పెట్టుబడుదారులకు ఆయన సాదర స్వాగతం పలికారు. భారత్ బలమైన ఆర్థికశక్తిగా మారుతుందన్న మోడీ.. గత నాలుగేళ్లలో ఎన్నో అద్భుతాలు చేశామన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాలు మంచి ఫలితాలు సాధించాయన్నారు ప్రధాని.

Latest Updates