నా చిరకాల స్నేహితుడిని కోల్పోయాను

అరుణ్ జైట్లీకి నివాళులు అర్పించిన ప్రధాని మోడీ

బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ వర్ధంతి సందర్బంగా ఆయనకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఈ రోజు జైట్లీ మొదటి వర్ధంతి. ఆయన గతేడాది ఆగష్టు 24, 2019న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

‘నా తోట మంత్రి, చిరకాల స్నేహితుడు అరుణ్ జైట్లీని గత సంవత్సరం ఇదే రోజున కోల్పోయాను. జైట్లీ దేశానికి చాలా సేవ చేశారు. ఆయన తెలివి, చతురత, వ్యక్తిత్వం చాలా గొప్పవి’అంటూ పొగుడుతూ.. గత సంవత్సరం జైట్లీ సంతాప సభలో తాను చేసిన ప్రసంగాన్ని మోడీ జత చేసి ట్వీట్ చేశారు.

ప్రధానితో మోడీతో పాటు.. హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో మరియు ఇతర నాయకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మొదటిసారిగా 2014లో ఏర్పడిన మోడీ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన రాజకీయాలలోకి రాకముందు న్యాయవాదిగా పనిచేసేవారు.

For More News..

‘సూపర్ స్పెషాలిటీ’ మరింత లేట్

పరిహారం ఇవ్వరు.. కొత్త ఇల్లు కట్టుకోనివ్వరు..

పేదలకు పైసా ఖర్చు లేకుండా ‘డబుల్‌‌‌‌’ ఇండ్లు

Latest Updates