ప్రధాని మోడీకి ప్రముఖుల బర్త్ డే విషెస్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం 70వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు విషెస్ చేస్తూ ట్వీట్లు చేశారు. జర్మనీ చాన్స్‌‌లర్ ఏంజెలా మెర్కెల్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా కూడా మోడీకి బర్త్ డే విషెస్ చెప్పారు. మోడీజీ హ్యాపీ బర్త్ డే అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశాన్ని బలోపేతం చేయడం కోసం త్యాగం చేస్తున్న మోడీకి హ్యాపీ బర్త్ డే అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. పేదలు, అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి, సాధికారత కోసం ప్రధాని మోడీ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని రాజ్‌‌నాథ్ ట్వీట్ చేశారు.

Latest Updates