దేశ ప్రజలకు ప్రధాని మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మకర సంక్రాంతి, మగ బిహు, పొంగల్ పండుగల సందర్భంగా ఆయన బుధవారం తన వరుస ట్వీట్లతో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘ప్రకృతి, సాంప్రదాయం మరియు సంస్కృతుల యొక్క రంగులతో మీ అందరికీ చాలా సంతోషకరమైన మరియు సంపన్నమైన మకర సంక్రాంతి శుభాకాంక్షలు’ అని మోడీ ట్వీట్ చేశారు. అస్సాం ప్రజలను ఉద్దేశించి..‘ మగ బిహు పండుగ ఆశను మరియు శ్రేయస్సును సూచిస్తుంది. ఈ పండుగ సందర్భంగా.. అందరికీ.. ముఖ్యంగా అస్సాంలోని నా సోదర సోదరీమణులకు ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ పండుగ అందరిలో స్ఫూర్తిని మరింత పెంచుతుంది’ అని ప్రధాని మోడీ మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘ప్రజలందరికీ పొంగల్ శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాలను సమృద్ధిగా నింపాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో జీవించాలి’ అని మోడీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మకర సంక్రాంతి హిందువులు జరుపుకునే పండుగల్లో ఒక గొప్ప పండుగ. ఈ పండుగ సూర్య దేవుడికి సంబంధించినది. అస్సాంలో ‘మగ బిహు’ పేరుతో జరుపుకునే ఈ పండుగ వార్షిక పంట వచ్చిన తరువాత వస్తుంది. పొంగల్ సూర్య భగవానుడిని కొలుస్తూ నాలుగు రోజులు జరుపుకునే పండుగ. ఈ పండుగకు గుర్తుగా పొంగల్ ప్రసాదాన్ని తయారుచేస్తారు. ఈ ప్రసాదాన్ని దేవతలకు నైవేద్యంగా పెడతారు. కొన్నిసార్లు ఆవులకు కూడా నైవేద్యంగా పెడతారు. ఈ తర్వాత కుటుంబ సభ్యలంతా కలిసి తింటారు.

Latest Updates