మోడీ స్పీచ్ రికార్డ్.. 19.7 కోట్ల మంది లైవ్‌ చూశారు..

న్యూఢిల్లీ: దేశంలో 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటిస్తూ ప్రధాని మోడీ టీవీలో చేసిన ప్రకటనను 19.7 కోట్ల మంది చూశారని, టీవీ రేటింగ్ లలోనే ఇదే హయ్యెస్టని బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్స్ కౌన్సిల్ రేటింగ్స్ చెబుతున్నాయి. ఈ నెల 24న ప్రజల్ని ఉద్దేశిస్తూ టీవీలో మాట్లాడిన మోడీ.. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ ను ప్రకటించారు. 201కి పైగా చానెళ్లు దీన్ని లైవ్ టెలికాస్ట్ ఇచ్చాయని, ఎక్కువ మంది వ్యూవర్లు చూశారని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ ట్వీట్ చేశారు. ఐపీఎల్ ఫైనల్‌ వ్యూవర్ షిప్ 13.3 కోట్లు కాగా, లాక్ డౌన్ పై ప్రధాని  ప్రకటనకు 19.7 కోట్ల వ్యూవర్ షిప్ ఉంది. మోడీ జనతా కర్ఫ్యూ ప్రకటనను 191 చానెళ్లు లైవ్ టెలికాస్ట్ చేస్తే 8.30 కోట్ల మంది చూశారు. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ గత ఆగస్టు 8న చేసిన ప్రసంగాన్ని  6.5 కోట్ల మంది చూశారు.

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

Latest Updates