అయోధ్య భూమిపూజను యూఎస్‌, యూకేలో మస్తు మంది చూసిన్రు

న్యూఢిల్లీ: ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని అయోధ్య రామజన్మభూమిలో ప్రధాని మోడీ చేసిన భూమి పూజ కార్యక్రమాన్ని ప్రపంచమంతా వీక్షించిందని అధికారులు చెప్పారు. యూఎస్‌, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, నేపాల్ దేశాల్లో ఎక్కువ మంది వీక్షించారని అన్నారు. య్యూ ట్యూబ్‌లో కూడా చాలా మంది చూశారు. యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, జపాన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్‌, కువైట్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పైన్స్‌, సింగపూర్‌‌, శ్రీలంక, నేపాల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, మలేషియా, మారిషస్‌ నుంచే ఎక్కువ వ్యూవర్‌‌షిప్‌ వచ్చిందని అన్నారు. మన దేశంలో దాదాపు 200 చానళ్లు దీన్ని లైవ్‌ ఇచ్చాయని అన్నారు. కార్యక్రమం మెయిన్‌ సిగ్నల్‌ని పబ్లిక్‌ బ్రాడ్‌కస్టర్‌‌ దూర్‌‌దర్శన్‌ జనరేట్‌ చేసింది. ఏషియా న్యూస్‌ ఇంటర్నేషనల్‌ (ఏఎన్‌ఐ) నుంచి దాదాపు 1200 స్టేషన్లకు, అసోసియేటెడ్‌ ప్రెస్‌ టెలివిజన్‌ న్యూస్‌ (ఏపీటీఎన్‌) 450 మీడియా హౌసులకు డిస్ట్రిబ్యూట్‌ చేశారని అధికారులు చెప్పారు. కరోనా కారణంగా తక్కువ మందితో కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం దేశంలోని ప్రజలంతా వీక్షించే విధంగా లైవ్‌ టెలికాస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Latest Updates