లాక్ డౌన్ తో పేదలు, యువతపై దాడి చేశారు

ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మరోమారు సర్కార్ పై విరుచుకు పడ్డారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి 21 రోజుల పాటు అకస్మాత్తుగా లాక్ డౌన్ విధించడం సరైన ప్లాన్ కాదన్నారు. ఇది అవ్యవస్థీకృత రంగాలకు ప్రధాని మోడీ వేసిన మరణ శిక్ష అని రాహుల్ దుయ్యబట్టారు. కేంద్ర సర్కార్, ప్రధాని మోడీ నిర్ణయాలు, పాలనాపరమైన విధానాల తప్పొప్పులపై తయారు చేసిన వీడియోల్లో చివరిదైన నాలుగో వీడియోను రాహుల్ తాజాగా ట్వీట్ చేశారు. దీనికి లాక్ డౌన్ కీ బాత్ అనే పేరు పెట్టారు.

‘ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కేంద్రం విధించిన లాక్ డౌన్ రోజు వారీ పేద కూలీలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధాని మోడీ దీన్ని 21 రోజుల యుద్ధం అన్నారు. కానీ అది దేశ అవ్యవస్థీకృత రంగ వెన్నెముకను దెబ్బ తీసింది. పేద ప్రజల అకౌంట్లలోకి నేరుగా డబ్బులను జమ చేయాలని కాంగ్రెస్ పలుమార్లు కేంద్రాన్ని కోరింది. కానీ ప్రభుత్వం వినలేదు. బదులుగా పారిశ్రామికవేత్తలకు లక్షలాది కోట్ల రూపాయలను సర్కార్ మాఫీ చేసింది. లాక్ డౌన్ అనేది కరో్నాపై చేసిన దాడి కాదు. పేద ప్రజలు, దేశ భవిత అయిన యువత, ఎస్ఎంఈలు, అవ్యవస్థీకృత ఎకానమీపై చేసిన అటాక్’ అని రాహుల్ చెప్పారు.

Latest Updates