అయోధ్య భూమి పూజను టీవీలో వీక్షించిన‌ ప్రధాని తల్లి

గుజ‌రాత్‌: అయోధ్యలో భ‌వ్య రామ మందిర నిర్మాణానికి బుధ‌వారం భూమిపూజను చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మందిర నిర్మాణానికి తొలి ఇటుక‌ను వేశారు. 175 మంది ప్రతినిధుల సమక్షంలో ఈ భూమిపూజ కార్య‌క్ర‌మం వైభవంగా సాగింది. ఎంతోమంది రామ‌భ‌క్తులు ఈ కార్య‌క్ర‌మ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాన్ని టీవీల ద్వారా వీక్షించారు. ప్రధాని మాతృమూర్తి హీరాబెన్ కూడా ‘భూమి పూజ’ ప్రత్యక్ష ప్రసారాన్ని గాంధీనగర్‌లోని తన నివాసంలో చూశారు.

భూమి పూజ స‌మ‌యంలో ప్రధాని ఆ ప్ర‌దేశానికి సాష్టాంగ న‌మ‌స్కారం చేసే స‌మ‌యంలో.. ఆయ‌న తల్లి హీరాబెన్ కూడా చేతులు జోడించి న‌మ‌స్క‌రించారు. హార‌తి ఇచ్చే స‌మ‌యంలో దేవుణ్ని ప్రార్ధించారు.

 

 

Latest Updates