కాంగ్రెస్‌లా పరిపాలిస్తే ఎప్పటికీ సమస్యల భారతమే

కాంగ్రెస్ తరహా పాలన సాగిస్తే దేశంలో సమస్యలన్నీ ఎప్పటికీ పరిష్కారం కావని ప్రధాని మోడీ అన్నారు. తమ ఐదేళ్ల పాలన చూసిన ప్రజలు పరిపాలన తీరులో మార్పు కొనసాగాలని 2019లో భారీ మెజారిటీతో ఎన్డీఏని గెలిపించారని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో మాట్లాడారు. గత కాంగ్రెస్ సర్కార్‌లాగా కాకుండా సమస్యలను పరిష్కరించేలా కొత్త ప్రభుత్వం ఉండాలని ఆశించారని అన్నారు.

తాము కూడా కాంగ్రెస్ లానే పని చేసి ఉంటే ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగేది కాన్నారు మోడీ. ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ వల్ల ఇబ్బందులు పడుతూనే ఉండేవారని అన్నారు. రామ జన్మభూమి అంశం ఎప్పటికీ పరిష్కారం కాకుండా మిగిలిపోయేదని చెప్పారు. 70ఏళ్ల తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయగలిగామని చెప్పారు. ప్రస్తుతం  రాజ్యాంగం గురించి గొప్పగా మాట్లాడుతున్న వాళ్లు దశాబ్దాలుగా జమ్ము కశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయలేదని అన్నారు మోడీ. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు అనేక సందర్భాల్లో తీవ్ర అభ్యంతరక భాషను వాడారని చెప్పారు. వాళ్లకి కశ్మీరీ ప్రజలపై నమ్మకం లేదని, కానీ తాము నమ్మామని అందుకు ఆర్టికల్ 370 రద్దు చేశామని చెప్పారు.

Latest Updates