ప్రధాని మోడీ కంటతడి

ప్రధాని మోడీ కంటతడి పెట్టారు. ఓ మహిళ మాట్లాడిన మాటలకు మోడీ బావోద్వేగంతో కంటతడి పెట్టారు. కొన్ని క్షణాల పాటు తన్మయానికి గురై మౌనం వహించారు.

ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషాది పరియోజన కార్యక్రమంలో భాగంగా జన ఔషధి కేంద్రాల యజమానులు… ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో  వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్ కు చెందిన దీపా షా మాట్లాడుతూ పథకం వల్లే ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆర్ధికంగా, మానసికంగా  ఇబ్బంది పడినట్లు తెలిపారు. “కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి భారతీయ జనౌషాది పరియోజన స్కీంలో భాగంగా తక్కువ ధరకే మందుల్ని కొనుగోలు చేసి, అనారోగ్యం నుంచి బయటపడడమే కాదు కడుపు నిండా తినగలుతున్నా దీనంతటికి కారణం ప్రధాని మోడీనే. నేను ఈశ్వరుణ్ని చూడలేదు..ప్రధాని మోడీని ఈశ్వరుడి రూపంలో చూస్తున్నానంటూ దీపా షా వ్యాఖ్యానించారు.

అయితే దీపా షా వ్యాఖ్యలపై మోడీ కంటతడి పెట్టారు. కొన్ని క్షణాల పాటు మౌనం వహించారు. అనంతరం కరోనా వైరస్ పట్ల ప్రధాని మోడీ ప్రజలకు పలు సూచనలిచ్చారు. వైరస్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దన్న మోడీ..షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ప్రతీ ఒక్కరు నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు

Latest Updates