మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.4వేలే!

PM Narendra Modi has bank balance of Rs 4,142, one property, no cars
  • మొత్తం ఆస్తులు రూ.2.51 కోట్లు
  • ఐదేండ్లలో 52 శాతంపెరిగిన సంపద
  • పైసా అప్పు లేదు..ఒక్క క్రిమినల్ కేసూ లేదు
  • ఢిల్లీలో డిగ్రీ, గుజరాత్ లో పీజీ చేశానని ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి

ఐదేండ్ల పదవీ కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు 52 శాతం పెరిగాయి. 2014లో రూ. 65.91లక్షలుగా ఉన్న చరాస్తి, 2019 నాటికి రూ.1.41కోట్లకు చేరింది. చర, స్థిరాస్తులన్నీ కలిపితే ఆయన పేరు మీద మొత్తం రూ.2.51 కోట్ల సంపద ఉంది. వారణాసి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేసిన ప్రధాని, అఫిడవిట్ లోఆస్తు లు, అప్పులతోపాటు కేసుల వివరాలూ వెల్లడించారు. అఫిడవిట్‌‌లో మోడీ తన మొత్తం ఆస్తుల విలువను రూ.2.51 కోట్లుగా పేర్కొన్నా రు. ఇందులో చరాస్తి రూ.1,41,36,119 కాగా, స్థిరాస్తి విలువను రూ.1.10 కోట్లుగా చూపించారు. వారణాసి నుంచి రెండోసారి పోటీ చేస్తున్న మోడీ, 2014లో మాత్రం తన చరాస్తిని రూ.65,91,582 గా ప్రకటించారు.గడిచిన ఐదేండ్లలో అది ఏకంగా 114.15 శాతం పెరిగి, రూ.1,41,36,119కు చేరింది. ఈ చరాస్తిలో అధికభాగం ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఉందని తెలిపారు. అప్పు ఒక్క రూపాయి కూడా లేదని పేర్కొన్నా రు.

ఇన్ కమ్ సోర్స్: గవర్నమెం ట్ నుం చి వచ్చే జీతండబ్బు లు, బ్యాం క్ సేవిం గ్స్ పై వచ్చే వడ్డీలే తనమెయిన్ ఇన్ కమ్ సో ర్స్ అని మోడీ చెప్పుకున్నా రు.స్థిరాస్తులు: గుజరాత్ రాజధాని గాం ధీనగర్ సిటీలోసెక్టార్ 1లో గల ఇంట్లో పావు శాతం వాటా తప్పతనకెలాం టి స్థి రాస్తు లు లేవని మోడీ ప్రకటిం చుకు-న్నారు. ప్రస్తు తం దాని విలువ సుమారు రూ. 1,10కోట్లు ఉంటుం దన్నా రు. 2014తో పోల్చుకుం టే ఈఇంటి విలువ రూ.10లక్షలు పెరిగింది.

చరాస్తులు: 2019, మార్చి 31 నాటికి తన చేతిలో రూ.38,750 క్యా ష్ ఉందని, బ్యాంకు లోబ్యా లెన్స్ మాత్రం రూ.4,143 అని అఫిడవిట్ లో పేర్కొన్న ప్రధాని మోడీ, స్టే ట్ బ్యాం క్ ఆఫ్ఇండియాలో రూ.1,27,81,574 ఫిక్స్ డ్ డి పాజిట్స్ ఉన్నా యని తెలిపారు. వీటితోపాటుఎల్ అండ్ టీ కంపెనీలో బాం డ్ల రూపంలో రూ.20 వేలు ఇన్వెస్ట్ చేశానని, రూ.7,61,466విలువైన నేషనల్ సేవిం గ్స్ సర్టిఫికేట్స్, లైఫ్ ఇన్సూరె న్స్ రూపంలో మరో రూ.1.90,347ఉన్నా యని తెలిపారు. తన వద్ద నాలుగు గోల్డ్ రిం గ్స్ ఉన్నా యని, వాటి బరువు 45 గ్రాములు కాగా, విలువ రూ.1,13,800 అని వె ల్లడించారు. అదే 2014 నాటి ఎన్నికల అఫిడవిట్లో.. చేతిలో క్యా ష్ రూ.32,700 ఉండగా, బ్యాం క్ బ్యా లెన్స్ ను రూ.26.05 లక్షలుగా, ఫిక్స్ డ్డిపాజిట్ల విలువను రూ.32.48 లక్షలుగా, గోల్డ్ రిం గ్స్ విలువను రూ.1.35 లక్షలుగా ఆయనచూపెట్టారు.

చదువు: దేశం ఎక్కడగానీ తనపై ఎలాం టి క్రిమినల్ కేసులు లేవని మోడీ అఫిడవిట్ లో చెప్పుకున్నారు. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుం చి డిగ్రీ చేశానని, 1983లో అహ్మదాబాద్ లోని గుజరాత్ యూనివర్సిటీ నుం చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నానని తెలిపారు.

Latest Updates