ఎన్నికల సమయంలో విమర్శలు సహజం : మోడీ

న్యూఢిల్లీ:దేశ ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇవాళ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఎన్నికల సమయంలో విమర్శలు సహజం అన్నారు. కాంగ్రెస్ సరిగ్గా పని చేసి ఉంటే ఎప్పుడో ప్రతి ఇంటికీ.. 24 గంటల కరెంటు వచ్చేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. ప్రజలకు నీతివంతమైన పాలన అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో బ్రోకర్లు లేకుండా పని జరిగేది కాదన్నారు. మొదటిసారి ఓటు వేసే యువతను ప్రోత్పహించాలని ప్రధాని సూచించారు. భారత్ ను అనేక రంగాల్లో అగ్రగామిగా చేశామన్న ఆయన.. సమస్యలు, సవాళ్లకు ఎదురు నిలిచామని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామన్నారు.

భారత్ లోనే ఎక్కువ సెల్ ఫోన్లు తయారవుతున్నాయి. భారత్ లోనే అత్యధికంగా మొబైల్‌ డేటా వినియోగిస్తున్నారని తెలిపారు. మహా కూటమి పేరుతో మరోసారి నాటకం మొదలుపెడుతున్నారన్నారు మోడీ.. 24 గంటలు దేశంకోసం పని చేస్తున్నామని..  దేశంలో పదికోట్ల మందికి టాయిలెట్లు కట్టించామని తెలిపారు. ఇందిరా గాంధీ 50 సార్లు ప్రభుత్వాలను పడగొట్టారన్నారు ప్రధాని మోడీ.

Latest Updates