ఆరోగ్యవన్ ఔషద మొక్కల పార్క్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ఇవాళ(శుక్రవారం) నర్మదా జిల్లాలోని కెవాడియాలో ‘ఆరోగ్య వన్’ ఔషధ మొక్కల పార్కును ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత ఆ ఉద్యానవనం మొత్తం తిరిగి పరిశీలించారు. మోడీ వెంట గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం విజయ్ రూపాని ఉన్నారు. పార్కు విశేషాలను వారు ప్రధానికి వివరించారు. కరోనా వ్యాప్తి క్రమంలో మార్చిలో లాక్ డౌన్ విధించాక మోడీ గుజరాత్ రావడం ఇదే మొదటి సారి. మోడీ తన పర్యటన సందర్భంగా నిన్న(గురువారం) చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కు నివాళులు అర్పించారు.

ఆరోగ్య వన్ పార్కులో వందల సంఖ్యలో ఔషధ మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఈ మొక్కలు, మూలికల గురించిన పూర్తి సమాచారాన్ని కూడా పార్కులో అందుబాటులో ఉంచారు.

Latest Updates